Tuesday, May 23, 2023

*మనిషి జీవితంలో అసలైన తోడు ఎవరు?*

*మనిషి జీవితంలో అసలైన తోడు ఎవరు?*
అమ్మనా?
నాన్ననా?
భార్యనా?
భర్తనా?
కొడుకా?
కూతురా?
స్నేహితులా?
బంధువులా ?

లేదు. ఎవరూ కాదు.!

నీ నిజమైన తోడు *నీ శరీరమే!*నీ శరీరం నీకు సహకరించని రోజున నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంతమంది డాక్టర్ లున్నా, జనాలు ఉన్న ఏమి చెయ్యలేరు సాగనంపడం తప్ప* 
ఒక్కసారి నీ శరీరం స్పందించడం ఆగిపోతే ఎవ్వరూ నీ దగ్గర ఉండరు గాక ఉండరు!!!
నువ్వు అవునన్నా, కాదన్నా, ఇది కఠిన నిజం.!!!
*నీవూ నీ శరీరం మాత్రమే జననం నుండి మరణం దాకా కలిసి ఉంటారు.* నీవు వాస్తవానికి ఆత్మ.
ఈ శరీరమే నీ అసలైన ఇల్లు. 
ఏదైతే నీ శరీరం కోసం బాధ్యతగా చేస్తావో అదే నీకు తప్పక తిరిగి వస్తుంది.
*నీవెంత ఎక్కువ శ్రద్ధగా శరీరాన్ని చూసుకుంటావో, నీ శరీరం కూడా నిన్ను అంతే శ్రద్ధగా చూసుకుంటుంది.*
నీవేమి తినాలి?
నీవేమి చేయాలి?
ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి?
నీవెంత విశ్రాంతి తీసుకోవాలి?
అనేవి మాత్రమే నీ శరీరం స్పందనను నిర్ణయిస్తాయి.
గుర్తించుకో !
నీ శరీరమొక్కటే నీవు జీవిస్తున్న చిరునామా!
నీ శరీరమే నీ ఆస్థి, సంపద.
వేరే ఏదీ కూడా దీనికి తుల తూగదు.
నీ శరీరం నీ బాధ్యత...

డబ్బు వస్తుంది. వెళ్తుంది.
బంధువులు, స్నేహితులు శాశ్వతం కాదు.
గుర్తుంచుకో.!
నీ శరీరానికి ఎవరూ సహాయం చేయలేరు. ఒక్క నీవు తప్ప...!

ఊపిరితిత్తులకు- *ప్రాణాయామం.*
మనసుకు- *ధ్యానము*
శరీరానికి- *యోగా.*
గుండెకు- *నడక.*
ప్రేగులకు- *మంచి ఆహారం.*
ఆత్మకు- *మంచి ఆలోచనలు.*
*సమాజం కోసం*- *మంచి పనులు.*

🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు*🙏

No comments:

Post a Comment

కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు

కొండాపురం: కొమ్మిలో పోలేరమ్మ పొంగళ్ళు కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో వెలసి ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి కు మంగళవారం పొంగళ్ళు పెట్ట...